Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #6 Translated in Telugu

أَكَانَ لِلنَّاسِ عَجَبًا أَنْ أَوْحَيْنَا إِلَىٰ رَجُلٍ مِنْهُمْ أَنْ أَنْذِرِ النَّاسَ وَبَشِّرِ الَّذِينَ آمَنُوا أَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِنْدَ رَبِّهِمْ ۗ قَالَ الْكَافِرُونَ إِنَّ هَٰذَا لَسَاحِرٌ مُبِينٌ
ఏమీ? మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించిన వారికి నిశ్చయంగా, తమ ప్రభువు వద్ద, వారు చేసి పంపిన మంచిపనులకు తగిన స్థానం ఉంది." అనే శుభవార్త వినిపించటానికి, మేము వారిలోని ఒక మనిషి (ముహమ్మద్) పై మా సందేశాన్ని అవతరింప జేయటం ప్రజలకు ఆశ్చర్యకమైన విషయంగా ఉందా? (ఎందుకంటే) సత్యతిరస్కారులు ఇలా అన్నారు: నిశ్చయంగా ఇతను పచ్చి మాంత్రికుడు
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ يُدَبِّرُ الْأَمْرَ ۖ مَا مِنْ شَفِيعٍ إِلَّا مِنْ بَعْدِ إِذْنِهِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ أَفَلَا تَذَكَّرُونَ
నిశ్చయంగా మీ పోషకుడూ, ప్రభువూ అయిన అల్లాహ్, ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తర్వాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. ఆయనే (సర్వసృష్టి) వ్యవహారాలను నడుపుతున్నాడు. ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవ్వడూ లేడు. ఆయనే అల్లాహ్! మీ పోషకుడు (ప్రభువు), కావున మీరు ఆయననే ఆరాధించండి. ఏమీ? మీరు హితోపదేశం స్వీకరించరా
إِلَيْهِ مَرْجِعُكُمْ جَمِيعًا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ إِنَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ بِالْقِسْطِ ۚ وَالَّذِينَ كَفَرُوا لَهُمْ شَرَابٌ مِنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ
ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయమైన ప్రతిఫల మివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి - వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు - త్రాగటానికి సలసల కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి
هُوَ الَّذِي جَعَلَ الشَّمْسَ ضِيَاءً وَالْقَمَرَ نُورًا وَقَدَّرَهُ مَنَازِلَ لِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ مَا خَلَقَ اللَّهُ ذَٰلِكَ إِلَّا بِالْحَقِّ ۚ يُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
ఆయనే, సూర్యుణ్ణి (ప్రకాశించే) దీపంగానూ మరియు చంద్రుణ్ణి వెలుగును (ప్రతిబింబింపజేసే) దాని గానూ చేసి, దానికి (పెరిగే - తరిగే) దశలు నియమించాడు, దాని ద్వారా మీరు సంవత్సరాల మరియు (కాలపు) గణనను తెలుసుకోవాలని. అల్లాహ్ ఇదంతా సత్యాధారంగా తప్ప సృష్టించలేదు. జ్ఞానం గల వారికి ఆయన తన సూచనలను (ఈ విధంగా) విశదీకరిస్తున్నాడు
إِنَّ فِي اخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا خَلَقَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِقَوْمٍ يَتَّقُونَ
నిశ్చయంగా, రేయింబవళ్ళ నిరంతర మార్పులలోనూ మరియు భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతిదానిలోనూ, దైవభీతి గల ప్రజలకు సూచనలున్నాయి

Choose other languages: