Quran Apps in many lanuages:

Surah Ta-Ha Ayahs #67 Translated in Telugu

قَالُوا إِنْ هَٰذَانِ لَسَاحِرَانِ يُرِيدَانِ أَنْ يُخْرِجَاكُمْ مِنْ أَرْضِكُمْ بِسِحْرِهِمَا وَيَذْهَبَا بِطَرِيقَتِكُمُ الْمُثْلَىٰ
(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడుకున్నారు: వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడల గొట్టి, మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించ గోరుతున్నారు
فَأَجْمِعُوا كَيْدَكُمْ ثُمَّ ائْتُوا صَفًّا ۚ وَقَدْ أَفْلَحَ الْيَوْمَ مَنِ اسْتَعْلَىٰ
కావున మీరు మీ యుక్తులను సమీకరించుకొని సమైక్యంగా (రంగంలోకి) దిగండి. ఈనాడు ప్రాబల్యం పొందిన వాడే, వాస్తవానికి సాఫల్యం (గెలుపు) పొందిన వాడు
قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَنْ تُلْقِيَ وَإِمَّا أَنْ نَكُونَ أَوَّلَ مَنْ أَلْقَىٰ
వారు (మాంత్రికులు) ఇలా అన్నారు: ఓ మూసా! నీవు విసురుతావా, లేదా మేము మొదట విసరాలా
قَالَ بَلْ أَلْقُوا ۖ فَإِذَا حِبَالُهُمْ وَعِصِيُّهُمْ يُخَيَّلُ إِلَيْهِ مِنْ سِحْرِهِمْ أَنَّهَا تَسْعَىٰ
(మూసా) అన్నాడు: లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ - వారి మంత్రజాలం వల్ల - అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి
فَأَوْجَسَ فِي نَفْسِهِ خِيفَةً مُوسَىٰ
దానితో మూసాకు, తన మసనస్సులో కొంత భయం కలిగింది

Choose other languages: