Quran Apps in many lanuages:

Surah Ta-Ha Ayahs #14 Translated in Telugu

إِذْ رَأَىٰ نَارًا فَقَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَعَلِّي آتِيكُمْ مِنْهَا بِقَبَسٍ أَوْ أَجِدُ عَلَى النَّارِ هُدًى
అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు: ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొని వస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు
فَلَمَّا أَتَاهَا نُودِيَ يَا مُوسَىٰ
అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు: ఓ మూసా
إِنِّي أَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَيْكَ ۖ إِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు
وَأَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا يُوحَىٰ
మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను
إِنَّنِي أَنَا اللَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدْنِي وَأَقِمِ الصَّلَاةَ لِذِكْرِي
నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు

Choose other languages: