Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #11 Translated in Telugu

وَقَالَ الَّذِينَ كَفَرُوا هَلْ نَدُلُّكُمْ عَلَىٰ رَجُلٍ يُنَبِّئُكُمْ إِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ إِنَّكُمْ لَفِي خَلْقٍ جَدِيدٍ
మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: మీరు (చచ్చి) దుమ్ముగా మారి, చెల్లాచెదురైన తరువాత కూడా! నిశ్చయంగా, మళ్ళీ క్రొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా
أَفْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَمْ بِهِ جِنَّةٌ ۗ بَلِ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ فِي الْعَذَابِ وَالضَّلَالِ الْبَعِيدِ
అతను అల్లాహ్ పై అబద్ధం కల్పించాడో లేక! అతనికి పిచ్చిపట్టిందో తెలియటం లేదు!" అలా కాదు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారు శిక్షకు గురి అవుతారు. మరియు వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు
أَفَلَمْ يَرَوْا إِلَىٰ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ إِنْ نَشَأْ نَخْسِفْ بِهِمُ الْأَرْضَ أَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِنَ السَّمَاءِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِكُلِّ عَبْدٍ مُنِيبٍ
ఏమిటి? వారు తమకు ముందున్న మరియు తమకు వెనుకనున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? మేము కోరితే, వారిని భూమిలోకి అణగ ద్రొక్కేవారం, లేదా వారిపై ఆకాశం నుండి ఒక ముక్కను పడవేసే వారం. నిశ్చయంగా, ఇందులో పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలే, ప్రతి దాసుని కొరకు ఒక సూచన ఉంది
وَلَقَدْ آتَيْنَا دَاوُودَ مِنَّا فَضْلًا ۖ يَا جِبَالُ أَوِّبِي مَعَهُ وَالطَّيْرَ ۖ وَأَلَنَّا لَهُ الْحَدِيدَ
మరియు వాస్తవంగా, మేము దావూద్ కు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము: ఓ పర్వతాల్లారా! మరియు పక్షులారా! అతనితో కలిసి (మా స్తోత్రాన్ని) ఉచ్ఛరించండి!" (అని మేము ఆజ్ఞాపించాము). మేము అతని కొరకు ఇనుమును మెత్తదిగా చేశాము
أَنِ اعْمَلْ سَابِغَاتٍ وَقَدِّرْ فِي السَّرْدِ ۖ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
(అతనికి ఇలా ఆదేశమిచ్చాము): నీవు కవచాలు తయారు చేయి మరియు వాటి వలయాలను (కడియాలను) సరిసమానంగా కూర్చు!" మరియు (ఓ మానవులారా!): మీరు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నేను చూస్తున్నాను

Choose other languages: