Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #38 Translated in Telugu

فَلَا تَهِنُوا وَتَدْعُوا إِلَى السَّلْمِ وَأَنْتُمُ الْأَعْلَوْنَ وَاللَّهُ مَعَكُمْ وَلَنْ يَتِرَكُمْ أَعْمَالَكُمْ
కావున మీరు (ధర్మయుద్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధి కొరకు అడగకండి మరియు మీరే ప్రాబల్యం వహిస్తారు. మరియు అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు మరియు ఆయన మీ కర్మలను వృథా కానివ్వడు
إِنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ ۚ وَإِنْ تُؤْمِنُوا وَتَتَّقُوا يُؤْتِكُمْ أُجُورَكُمْ وَلَا يَسْأَلْكُمْ أَمْوَالَكُمْ
నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్ని కూడా అడగడు
إِنْ يَسْأَلْكُمُوهَا فَيُحْفِكُمْ تَبْخَلُوا وَيُخْرِجْ أَضْغَانَكُمْ
ఒకవేళ ఆయన దానిని (ధనాన్నే) అడిగితే మరియు దాని కొరకు గట్టి పట్టుపట్టితే, మీరు పిసినారితనం చూపితే, ఆయన మీ ద్వేషాన్ని బయట పెట్టేవాడు
هَا أَنْتُمْ هَٰؤُلَاءِ تُدْعَوْنَ لِتُنْفِقُوا فِي سَبِيلِ اللَّهِ فَمِنْكُمْ مَنْ يَبْخَلُ ۖ وَمَنْ يَبْخَلْ فَإِنَّمَا يَبْخَلُ عَنْ نَفْسِهِ ۚ وَاللَّهُ الْغَنِيُّ وَأَنْتُمُ الْفُقَرَاءُ ۚ وَإِنْ تَتَوَلَّوْا يَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ ثُمَّ لَا يَكُونُوا أَمْثَالَكُمْ
ఇదిగో చూడండి! వారు మీరే! అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలువబడుతున్నవారు. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. మరియు ఎవడు పిసినారితనం వహిస్తున్నాడో, అతడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు మరియు మీరే కొరత గల (పేద) వారు. మరియు మీరు విముఖులైతే ఆయన మీకు బదులుగా ఇతర జాతిని మీ స్థానంలో తేగలడు, అప్పుడు వారు మీలాంటి వారై ఉండరు

Choose other languages: