Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #54 Translated in Telugu

قَالُوا أَوَلَمْ تَكُ تَأْتِيكُمْ رُسُلُكُمْ بِالْبَيِّنَاتِ ۖ قَالُوا بَلَىٰ ۚ قَالُوا فَادْعُوا ۗ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
వారు (రక్షకులు) అంటారు: ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవప్రవక్తలు రాలేదా?" అప్పుడు వారంటారు: అవును (వచ్చారు)!" వారికి ఇలా జవాబివ్వబడుతుంది: అయితే మీరే ప్రార్థించండి!" కాని సత్యతిరస్కారుల ప్రార్థన నిష్ఫలమే అవుతుంది
إِنَّا لَنَنْصُرُ رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا وَيَوْمَ يَقُومُ الْأَشْهَادُ
నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము
يَوْمَ لَا يَنْفَعُ الظَّالِمِينَ مَعْذِرَتُهُمْ ۖ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ
ఆరోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు. వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) ఉంటుంది. మరియు వారికి అతి దుర్భరమైన నిలయం ఉంటుంది
وَلَقَدْ آتَيْنَا مُوسَى الْهُدَىٰ وَأَوْرَثْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ
మరియు వాస్తవంగా మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రాయీల్ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్ కు) వారసులుగా చేశాము
هُدًى وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ
బుద్ధిమంతులకు మార్గదర్శకత్వంగా మరియు హితోపదేశంగా

Choose other languages: