Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #32 Translated in Telugu

وَقَالَ رَجُلٌ مُؤْمِنٌ مِنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَنْ يَقُولَ رَبِّيَ اللَّهُ وَقَدْ جَاءَكُمْ بِالْبَيِّنَاتِ مِنْ رَبِّكُمْ ۖ وَإِنْ يَكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهُ ۖ وَإِنْ يَكُ صَادِقًا يُصِبْكُمْ بَعْضُ الَّذِي يَعِدُكُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ
అప్పుడు తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిర్ఔన్ కుటుంబపు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఏమీ? మీరు, `అల్లాహ్ యే నా ప్రభువు.` అని అన్నందుకు, ఒక వ్యక్తిని చంపగోరుతున్నారా? వాస్తవానికి, అతను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాడు కదా! మరియు ఒకవేళ అతను అసత్యవాది అయితే, అతని అసత్యం అతని మీదనే పడుతుంది! కాని ఒకవేళ అతను సత్యవంతుడే అయితే, అతను హెచ్చరించే (శిక్ష) మీపై పడవచ్చు కదా! నిశ్చయంగా, అల్లాహ్ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు
يَا قَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظَاهِرِينَ فِي الْأَرْضِ فَمَنْ يَنْصُرُنَا مِنْ بَأْسِ اللَّهِ إِنْ جَاءَنَا ۚ قَالَ فِرْعَوْنُ مَا أُرِيكُمْ إِلَّا مَا أَرَىٰ وَمَا أَهْدِيكُمْ إِلَّا سَبِيلَ الرَّشَادِ
ఓ నా జాతి ప్రజలారా! ఈనాడు రాజ్యాధికారం మీదే; దేశంలో మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు, కాని ఒకవేళ అల్లాహ్ శిక్ష మన మీద వచ్చి పడితే, అప్పుడు మనకెవడు సహాయం చేయగలడు?" అప్పుడు ఫిర్ఔన్ అన్నాడు: నాకు సముచితమైన మార్గమే నేను మీకూ చూపుతాను, నేను మీకు మార్గదర్శకత్వం చేసేది కేవలం సరైన మార్గం వైపునకే
وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُمْ مِثْلَ يَوْمِ الْأَحْزَابِ
మరియు విశ్వసించిన ఆ వ్యక్తి అన్నాడు: నా జాతి ప్రజలారా! నిశ్చయంగా పూర్వం అనేక సంఘాలకు దాపురించిన దినమే మీకూ దాపురించునేమోనని నేను భయపడుతున్నాను
مِثْلَ دَأْبِ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَالَّذِينَ مِنْ بَعْدِهِمْ ۚ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِلْعِبَادِ
నూహ్, ఆద్, సమూద్ మరియు వారి తరువాత వచ్చిన జాతుల వారికి వచ్చినటువంటి (దుర్దినం). మరియు అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేయగోరడు
وَيَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِ
మరియు ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి నేను, మీరు పరస్పరం పిలుచుకునే, ఆ దినం గురించి భయపడుతున్నాను

Choose other languages: