Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #13 Translated in Telugu

وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَنْ تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)
إِنَّ الَّذِينَ كَفَرُوا يُنَادَوْنَ لَمَقْتُ اللَّهِ أَكْبَرُ مِنْ مَقْتِكُمْ أَنْفُسَكُمْ إِذْ تُدْعَوْنَ إِلَى الْإِيمَانِ فَتَكْفُرُونَ
నిశ్చయంగా, (ఆ రోజు) సత్యతిరస్కారులను పిలిచి వారితో: ఈరోజు మీకు, మీ పట్ల ఎంత అసహ్యం కలుగుతున్నదో! మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా మీరు నిరాకరించినపుడు, అల్లాహ్ కు మీ పట్ల ఇంత కంటే ఎక్కువ అసహ్యం కలిగేది!" అని అనబడుతుంది
قَالُوا رَبَّنَا أَمَتَّنَا اثْنَتَيْنِ وَأَحْيَيْتَنَا اثْنَتَيْنِ فَاعْتَرَفْنَا بِذُنُوبِنَا فَهَلْ إِلَىٰ خُرُوجٍ مِنْ سَبِيلٍ
వారు ఇలా అంటారు: ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని ఇచ్చావు మరియు రెండు సార్లు జీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయట పడే మార్గం ఏదైనా ఉందా
ذَٰلِكُمْ بِأَنَّهُ إِذَا دُعِيَ اللَّهُ وَحْدَهُ كَفَرْتُمْ ۖ وَإِنْ يُشْرَكْ بِهِ تُؤْمِنُوا ۚ فَالْحُكْمُ لِلَّهِ الْعَلِيِّ الْكَبِيرِ
(వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది): దీనికి కారణమేమిటంటే వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్ ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగస్వాములు కల్పించబడినప్పుడు, మీరు విశ్వసించారు! ఇప్పుడు తీర్పు మహోన్నతుడు, మహనీయుడు అయిన అల్లాహ్ చేతిలో ఉంది
هُوَ الَّذِي يُرِيكُمْ آيَاتِهِ وَيُنَزِّلُ لَكُمْ مِنَ السَّمَاءِ رِزْقًا ۚ وَمَا يَتَذَكَّرُ إِلَّا مَنْ يُنِيبُ
ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని అవతరింపజేసేవాడు. కాని, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలేవారు తప్ప, ఇతరులు వీటిని గ్రహించలేరు

Choose other languages: