Quran Apps in many lanuages:

Surah Az-Zukhruf Ayahs #13 Translated in Telugu

وَلَئِنْ سَأَلْتَهُمْ مَنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ
ఒకవేళ, నీవు వారితో: భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు." అని అంటారు
الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَعَلَّكُمْ تَهْتَدُونَ
ఆయనే మీ కొరకు ఈ భూమిని పరుపుగా చేశాడు; మరియు మీరు మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి, అందులో మీ కొరకు త్రోవలు ఏర్పరచాడు
وَالَّذِي نَزَّلَ مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَنْشَرْنَا بِهِ بَلْدَةً مَيْتًا ۚ كَذَٰلِكَ تُخْرَجُونَ
మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు
وَالَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُمْ مِنَ الْفُلْكِ وَالْأَنْعَامِ مَا تَرْكَبُونَ
మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు
لِتَسْتَوُوا عَلَىٰ ظُهُورِهِ ثُمَّ تَذْكُرُوا نِعْمَةَ رَبِّكُمْ إِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَٰذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ
మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించటానికి: ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు

Choose other languages: