Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #75 Translated in Telugu

قِيلَ ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
వారితో ఇలా అనబడుతుంది: నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాస స్థలం ఎంత చెడ్డది
وَسِيقَ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ إِلَى الْجَنَّةِ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا وَفُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلَامٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوهَا خَالِدِينَ
మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు, దాని ద్వారాలు తెరువ బడతాయి మరియు దాని రక్షకులు వారితో అంటారు: మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి
وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي صَدَقَنَا وَعْدَهُ وَأَوْرَثَنَا الْأَرْضَ نَتَبَوَّأُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشَاءُ ۖ فَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
మరియు వారంటారు: మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు మరియు ఆయనే మమ్మల్ని ఈ నేలకు వారసులుగా చేశాడు. స్వర్గంలో మేము కోరిన చోట స్థిరనివాసం ఏర్పరచుకోగలము! సత్కార్యాలు చేసేవారి ప్రతిఫలం ఎంత ఉత్తమమైనది
وَتَرَى الْمَلَائِكَةَ حَافِّينَ مِنْ حَوْلِ الْعَرْشِ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ ۖ وَقُضِيَ بَيْنَهُمْ بِالْحَقِّ وَقِيلَ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. మరియు వారి (సర్వ ప్రాణుల) మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు : సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు." అని పలుకబడుతుంది

Choose other languages: