Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #11 Translated in Telugu

9:7
كَيْفَ يَكُونُ لِلْمُشْرِكِينَ عَهْدٌ عِنْدَ اللَّهِ وَعِنْدَ رَسُولِهِ إِلَّا الَّذِينَ عَاهَدْتُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ فَمَا اسْتَقَامُوا لَكُمْ فَاسْتَقِيمُوا لَهُمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ
బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరామ్ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు
9:8
كَيْفَ وَإِنْ يَظْهَرُوا عَلَيْكُمْ لَا يَرْقُبُوا فِيكُمْ إِلًّا وَلَا ذِمَّةً ۚ يُرْضُونَكُمْ بِأَفْوَاهِهِمْ وَتَأْبَىٰ قُلُوبُهُمْ وَأَكْثَرُهُمْ فَاسِقُونَ
(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు
9:9
اشْتَرَوْا بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا فَصَدُّوا عَنْ سَبِيلِهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ
వారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి
لَا يَرْقُبُونَ فِي مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُعْتَدُونَ
వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దును అతిక్రమించినవారు
فَإِنْ تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ ۗ وَنُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
కావున వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగల వారికి, మేము మా సూచనలను, ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము

Choose other languages: