Quran Apps in many lanuages:

Surah Ash-Shura Ayahs #26 Translated in Telugu

تَرَى الظَّالِمِينَ مُشْفِقِينَ مِمَّا كَسَبُوا وَهُوَ وَاقِعٌ بِهِمْ ۗ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فِي رَوْضَاتِ الْجَنَّاتِ ۖ لَهُمْ مَا يَشَاءُونَ عِنْدَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ
ఈ దుర్మార్గులు (పునరుత్థాన దినాన) తాము చేసిన కర్మల ఫలితాన్ని చూసి భయపడటాన్ని, నీవు చూస్తావు మరియు అది వారిపై తప్పక పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారు స్వర్గపు పచ్చిక మైదానాలలో ఉంటారు. వారికి తాము కోరేదంతా తమ ప్రభువు తరఫు నుండి లభిస్తుంది అదే ఆ గొప్ప అనుగ్రహం
ذَٰلِكَ الَّذِي يُبَشِّرُ اللَّهُ عِبَادَهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۗ قُلْ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا إِلَّا الْمَوَدَّةَ فِي الْقُرْبَىٰ ۗ وَمَنْ يَقْتَرِفْ حَسَنَةً نَزِدْ لَهُ فِيهَا حُسْنًا ۚ إِنَّ اللَّهَ غَفُورٌ شَكُورٌ
ఆ (స్వర్గపు) శుభవార్తనే, అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: నేను దీనికి బదులుగా మీ నుండి బంధుత్వ ప్రేమ తప్ప వేరే ప్రతిఫలాన్ని కోరడం లేదు!" మరియు ఎవడు మంచిని సంపాదించుకుంటాడో, అతనికి దానిలో మేము మరింత మంచిని పెంచుతాము. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు
أَمْ يَقُولُونَ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا ۖ فَإِنْ يَشَإِ اللَّهُ يَخْتِمْ عَلَىٰ قَلْبِكَ ۗ وَيَمْحُ اللَّهُ الْبَاطِلَ وَيُحِقُّ الْحَقَّ بِكَلِمَاتِهِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
ఏమీ? వారు: అతను (ముహమ్మద్!) అల్లాహ్ పేరుతో అసత్యాలు కల్పిస్తున్నాడు" అని అంటున్నారా? కాని ఒకవేళ అల్లాహ్ తలచుకుంటే, నీ హృదయం మీద ముద్రవేసే వాడు. మరియు అల్లాహ్ అసత్యాన్ని రూపుమాపి, తన ఆజ్ఞతో సత్యాన్ని స్థాపిస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్నదంతా బాగా తెలుసు
وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ
ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. మరియు పాపాలను మన్నించేవాడు. మరియు మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు
وَيَسْتَجِيبُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَيَزِيدُهُمْ مِنْ فَضْلِهِ ۚ وَالْكَافِرُونَ لَهُمْ عَذَابٌ شَدِيدٌ
మరియు ఆయన విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు మరియు వారిపై తన అనుగ్రహాన్ని మరింత అధికం చేస్తాడు. ఇక సత్యతిరస్కారులు! వారికి కఠిన శిక్ష పడుతుంది

Choose other languages: