Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #47 Translated in Telugu

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْرَبُوا الصَّلَاةَ وَأَنْتُمْ سُكَارَىٰ حَتَّىٰ تَعْلَمُوا مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا ۚ وَإِنْ كُنْتُمْ مَرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِنْكُمْ مِنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ اللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا
ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే, మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే - స్నానం చేయనంత వరకు - నమాజ్ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాట వలసి వస్తే తప్ప. కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్రవిసర్జన చేసి ఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే - మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి). నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يَشْتَرُونَ الضَّلَالَةَ وَيُرِيدُونَ أَنْ تَضِلُّوا السَّبِيلَ
ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా (చూడలేదా)? వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుంటున్నారు మరియు మీరు కూడా సన్మార్గం నుండి తప్పిపోవాలని కోరుతున్నారు
وَاللَّهُ أَعْلَمُ بِأَعْدَائِكُمْ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَلِيًّا وَكَفَىٰ بِاللَّهِ نَصِيرًا
మరియు అల్లాహ్ మీ శత్రువులను బాగా ఎరుగును. కావున మీ రక్షకుడుగా అల్లాహ్ యే చాలు మరియు మీకు సహాయకుడుగా కూడా అల్లాహ్ యే చాలు
مِنَ الَّذِينَ هَادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَنْ مَوَاضِعِهِ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَاعِنَا لَيًّا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِي الدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا سَمِعْنَا وَأَطَعْنَا وَاسْمَعْ وَانْظُرْنَا لَكَانَ خَيْرًا لَهُمْ وَأَقْوَمَ وَلَٰكِنْ لَعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا
యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి`అనా వ `అ`సయ్ నా)." అనీ; మరియు: విను! నీ మాట వినకబోవు గాక! (వస్ మ `అ `గైర మస్ మ`ఇన్)." అనీ; మరియు (ఓ ముహమ్మద్!) నీవు మా మాట విను (రా`ఇనా) అనీ తమ నాలుకలను మెలి త్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: విన్నాము, విధేయులమయ్యాము. (సమి`అనా వ అ`త`అనా)." అనీ; మరియు: మమ్మల్ని విను మరియు మా దిక్కుచూడు / మాకు వ్యవధినివ్వు (వస్ మ`అ వన్`జుర్ నా)," అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు
يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِمَا مَعَكُمْ مِنْ قَبْلِ أَنْ نَطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا
ఓ గ్రంథ ప్రజలారా! మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి, మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే (నాశనం చేయక ముందే). లేక మేము సబ్త్ వారిని శపించినట్లుగా (బహిష్కరించినట్లుగా) మిమ్మల్ని కూడా శపించక (బహిష్కరించక) ముందే (దీనిని విశ్వసించండి). ఎందుకంటే! అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది

Choose other languages: