Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #163 Translated in Telugu

وَإِنْ مِنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا
మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు
فَبِظُلْمٍ مِنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَنْ سَبِيلِ اللَّهِ كَثِيرًا
యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గాలకు ఫలితంగానూ మరియు వారు, అనేకులను అల్లాహ్ మార్గంపై నడువకుండా ఆటంక పరుస్తూ ఉన్నందు వలననూ, మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము
وَأَخْذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا
మరియు వాస్తవానికి, వారికి నిషేధింపబడినా; వారు వడ్డీ తీసుకోవటం వలననూ మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలననూ, మరియు వారిలో అవిశ్వాసులైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాము
لَٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِنْ قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا
కాని వారిలో పరిపూర్ణమైన జ్ఞానం గలవారు మరియు విశ్వాసులైనవారు, నీపై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమాజ్ విధిగా సలుపుతారు, విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసం కలిగి ఉంటారు; ఇలాంటి వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము
إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِنْ بَعْدِهِ ۚ وَأَوْحَيْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۚ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావూద్ కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము

Choose other languages: