Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #89 Translated in Telugu

وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنْظَرُونَ
మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు
وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِنْ دُونِكَ ۖ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ
మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు, తాము సాటిగా నిలిపిన వారిని చూసి అంటారు: ఓ మా ప్రభూ! వీరే మేము నీకు సాటి కల్పించి, నీకు బదులుగా ఆరాధించిన వారు." కాని (సాటిగా నిలుపబడిన) వారు, సాటి కల్పించిన వారి మాటలను వారి వైపుకే విసురుతూ అంటారు: నిశ్చయంగా, మీరు అసత్యవాదులు
وَأَلْقَوْا إِلَى اللَّهِ يَوْمَئِذٍ السَّلَمَ ۖ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ
మరియు ఆ రోజు (అందరూ) వినమ్రులై తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి (దైవాలు) వారిని త్యజించి ఉంటాయి
الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ
ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో వారికి, మేము వారు చేస్తూ ఉండిన దౌర్జన్యాలకు శిక్ష మీద శిక్ష విధిస్తాము
وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِمْ مِنْ أَنْفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰؤُلَاءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము. ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి

Choose other languages: