Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #17 Translated in Telugu

وَمَا ذَرَأَ لَكُمْ فِي الْأَرْضِ مُخْتَلِفًا أَلْوَانُهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِقَوْمٍ يَذَّكَّرُونَ
మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి (వ్యాపింప) జేశాడు. నిశ్చయంగా, హితబోధ స్వీకరించే వారికి వీటిలో సూచన ఉంది
وَهُوَ الَّذِي سَخَّرَ الْبَحْرَ لِتَأْكُلُوا مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى الْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا مِنْ فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
మరియు ఆయన సముద్రాన్ని - తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి - మీకు ఉపయుక్తమైనదిగా చేశాడు. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి (ప్రజలు), అందులో ఓడల మీద దాని నీటిని చీల్చుకొని పోవటాన్ని నీవు చూస్తున్నావు. మరియు బహుశా మీరు కృతజ్ఞులు అవుతారని ఆయన మీకు (ఇవన్నీ ప్రసాదించాడు)
وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَنْ تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَعَلَّكُمْ تَهْتَدُونَ
మరియు భూమి మీతో పాటు చలించకుండా ఉండటానికి, ఆయన దానిలో స్థిరమైన పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను ప్రవహింపజేశాడు. మరియు రహదారులను నిర్మించాడు. బహుశా మీరు మార్గం పొందుతారని
وَعَلَامَاتٍ ۚ وَبِالنَّجْمِ هُمْ يَهْتَدُونَ
మరియు (భూమిలో మార్గం చూపే) సంకేతాలను పెట్టాడు. మరియు వారు (ప్రజలు) నక్షత్రాల ద్వారా కూడా తమ మార్గాలు తెలుసుకుంటారు
أَفَمَنْ يَخْلُقُ كَمَنْ لَا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ
సృష్టించేవాడూ అసలు ఏమీ సృష్టించలేని వాడూ సమానులా? ఇది మీరెందుకు గమనించరు

Choose other languages: