Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #118 Translated in Telugu

فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَتَ اللَّهِ إِنْ كُنْتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
కావున మీరు అల్లాహ్ నే ఆరాధించే వారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి
إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنْزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు/పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేర) జిబహ్ చేయబడినది (పశువు/పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్) నియమాలను ఉల్లంఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరం లేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَٰذَا حَلَالٌ وَهَٰذَا حَرَامٌ لِتَفْتَرُوا عَلَى اللَّهِ الْكَذِبَ ۚ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలక కండి. నిశ్చయంగా, అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు
مَتَاعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
దీనితో కొంత వరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِنْ قَبْلُ ۖ وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని, ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు

Choose other languages: