Quran Apps in many lanuages:

Surah Al-Mumenoon Ayahs #88 Translated in Telugu

قُلْ لِمَنِ الْأَرْضُ وَمَنْ فِيهَا إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
వారిని ఇలా అడుగు: ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి
سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ
వారంటారు: అల్లాహ్ కే!" వారితో అను: అయినా మీరు హితోపదేశం స్వీకరించరా
قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ
వారిని అడుగు: సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు ఎవరు
سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ
వారంటారు: అల్లాహ్ మాత్రమే!" అని. వారితో అను: అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు
قُلْ مَنْ بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
వారిని ఇలా అడుగు: మీకు తెలిస్తే చెప్పండి! ప్రతిదానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చేవాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వగల వాడెవ్వడూ లేనివాడు, ఎవరు

Choose other languages: