Quran Apps in many lanuages:

Surah Al-Mujadala Ayahs #22 Translated in Telugu

إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ أُولَٰئِكَ فِي الْأَذَلِّينَ
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తారో! అలాంటి వారే, పరమ నీచులలో చేరిన వారు
كَتَبَ اللَّهُ لَأَغْلِبَنَّ أَنَا وَرُسُلِي ۚ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ
నిశ్చయంగా, నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము" అని అల్లాహ్ వ్రాసి పెట్టాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహాబలశాలి, సర్వశక్తిమంతుడు
لَا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُمْ بِرُوحٍ مِنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ
అల్లాహ్ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించేవారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు! ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుటుంబం వారైనా సరే! అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూహ్) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటి వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ పక్షం వారే సాఫల్యం పొందేవారు

Choose other languages: