Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #71 Translated in Telugu

يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ ۖ وَإِنْ لَمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهُ ۚ وَاللَّهُ يَعْصِمُكَ مِنَ النَّاسِ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నీవట్టు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు
قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُقِيمُوا التَّوْرَاةَ وَالْإِنْجِيلَ وَمَا أُنْزِلَ إِلَيْكُمْ مِنْ رَبِّكُمْ ۗ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِنْهُمْ مَا أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
ఇలా అను: ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!" మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని మరియు సత్యతిరస్కారాన్ని మాత్రమే పెంచుతుంది. కావున నీవు సత్యతిరస్కార ప్రజలను గురించి విచారించకు
إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئُونَ وَالنَّصَارَىٰ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
నిశ్చయంగా, ఈ (గ్రంథాన్ని) విశ్వసించిన వారు (ముస్లింలు) మరియు యూదులు మరియు సాబీయూలు మరియు క్రైస్తవులు, ఎవరైనా సరే అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తే, సత్కార్యాలు చేస్తే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా
لَقَدْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَأَرْسَلْنَا إِلَيْهِمْ رُسُلًا ۖ كُلَّمَا جَاءَهُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنْفُسُهُمْ فَرِيقًا كَذَّبُوا وَفَرِيقًا يَقْتُلُونَ
వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారి నుండి ఒక గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము మరియు వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని ఏ ప్రవక్త అయినా వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని తెచ్చినపుడల్లా, వారు కొందరిని అసత్యవాదులని తిరస్కరించారు, మరి కొందరిని హత్య చేశారు
وَحَسِبُوا أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا وَصَمُّوا ثُمَّ تَابَ اللَّهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا وَصَمُّوا كَثِيرٌ مِنْهُمْ ۚ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
మరియు తమకెలాంటి శిక్ష (ఫిత్నా) పడదని తలచి, వారు గ్రుడ్డి వారుగా, చెవిటి వారుగా అయిపోయారు. ఆ పిదప అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. ఆ తరువాత కూడ వారిలో అనేకులు తిరిగి గ్రుడ్డి వారుగా, చెవిటి వారుగా అయి పోయారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు

Choose other languages: