Quran Apps in many lanuages:

Surah Al-Kahf Ayahs #37 Translated in Telugu

كِلْتَا الْجَنَّتَيْنِ آتَتْ أُكُلَهَا وَلَمْ تَظْلِمْ مِنْهُ شَيْئًا ۚ وَفَجَّرْنَا خِلَالَهُمَا نَهَرًا
ఆ రెండు తోటలు, ఏ కొరతా లేకుండా (పుష్కలంగా) పంటలిచ్చేవి. మరియు వాటి మధ్య మేము ఒక సెలయేరును ప్రవహింపజేశాము
وَكَانَ لَهُ ثَمَرٌ فَقَالَ لِصَاحِبِهِ وَهُوَ يُحَاوِرُهُ أَنَا أَكْثَرُ مِنْكَ مَالًا وَأَعَزُّ نَفَرًا
మరియు అతడికి పుష్కలమైన ఫలాలు పండేవి (లాభాలు వచ్చేవి). మరియు అతడు తన పొరుగువాడితో మాట్లాడుతూ అన్నాడు: నేను నీ కంటే ఎక్కువ ధనవంతుణ్ణి మరియు నా వద్ద బలవంతులైన మనుషులు కూడా ఉన్నారు
وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَنْ تَبِيدَ هَٰذِهِ أَبَدًا
మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునేవాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను
وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِنْ رُدِدْتُ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِنْهَا مُنْقَلَبًا
మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను, ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీని కంటే మేలైన స్థానాన్నే పొందగలను
قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِنْ تُرَابٍ ثُمَّ مِنْ نُطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلًا
అతడి పొరుగువాడు అతడితో మాట్లాడుతూ అన్నాడు: నిన్ను మట్టితో, తరువాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తరువాత నిన్ను (సంపూర్ణ) మానవుడిగా తీర్చిదిద్దిన ఆయన (అల్లాహ్)ను నీవు తిరస్కరిస్తున్నావా

Choose other languages: