Quran Apps in many lanuages:

Surah Al-Hijr Ayahs #23 Translated in Telugu

وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنْبَتْنَا فِيهَا مِنْ كُلِّ شَيْءٍ مَوْزُونٍ
మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము
وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ وَمَنْ لَسْتُمْ لَهُ بِرَازِقِينَ
మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము
وَإِنْ مِنْ شَيْءٍ إِلَّا عِنْدَنَا خَزَائِنُهُ وَمَا نُنَزِّلُهُ إِلَّا بِقَدَرٍ مَعْلُومٍ
మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము
وَأَرْسَلْنَا الرِّيَاحَ لَوَاقِحَ فَأَنْزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَسْقَيْنَاكُمُوهُ وَمَا أَنْتُمْ لَهُ بِخَازِنِينَ
మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు
وَإِنَّا لَنَحْنُ نُحْيِي وَنُمِيتُ وَنَحْنُ الْوَارِثُونَ
మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము

Choose other languages: