Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #47 Translated in Telugu

وَقَوْمُ إِبْرَاهِيمَ وَقَوْمُ لُوطٍ
మరియు ఇబ్రాహీమ్ జాతివారు మరియు లూత్ జాతివారు
وَأَصْحَابُ مَدْيَنَ ۖ وَكُذِّبَ مُوسَىٰ فَأَمْلَيْتُ لِلْكَافِرِينَ ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
మరియు మద్ యన్ వాసులు కూడాను! అంతేకాదు మూసా కూడా అసత్యవాదుడవని తిరస్కరించబడ్డాడు. కావున నేను సత్యతిరస్కారులకు (మొదట) కొంత వ్యవధినిచ్చి, తరువాత పట్టుకుంటాను. (చూశారా!) నన్ను తిరస్కరించడం వారి కొరకు ఎంత ఘోరమైనదిగా ఉండెనో
فَكَأَيِّنْ مِنْ قَرْيَةٍ أَهْلَكْنَاهَا وَهِيَ ظَالِمَةٌ فَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَبِئْرٍ مُعَطَّلَةٍ وَقَصْرٍ مَشِيدٍ
(ఈ విధంగా), మేము ఎన్నో పురాలను నాశనం చేశాము. ఎందుకంటే, వాటి (ప్రజలు) దుర్మార్గులై ఉండిరి. (ఈనాడు) అవి నాశనమై, తమ కప్పుల మీద తలక్రిందులై పడి వున్నాయి. వారి బావులు మరియు వారి దృఢమైన కోటలు కూడా పాడుపడి ఉన్నాయి
أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَتَكُونَ لَهُمْ قُلُوبٌ يَعْقِلُونَ بِهَا أَوْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۖ فَإِنَّهَا لَا تَعْمَى الْأَبْصَارُ وَلَٰكِنْ تَعْمَى الْقُلُوبُ الَّتِي فِي الصُّدُورِ
ఏమీ? వారు భూమిలో ప్రయాణం చేయరా? దానిని, వారి హృదయాలు (మనస్సులు) అర్థం చేసుకోగలగటానికి మరియు వారి చెవులు దానిని వినటానికి? వాస్తవమేమిటంటే వారి కన్నులైతే గ్రుడ్డివి కావు, కాని ఎదలలో ఉన్న హృదయాలే గ్రుడ్డివయి పోయాయి
وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَلَنْ يُخْلِفَ اللَّهُ وَعْدَهُ ۚ وَإِنَّ يَوْمًا عِنْدَ رَبِّكَ كَأَلْفِ سَنَةٍ مِمَّا تَعُدُّونَ
మరియు (ఓ ముహమ్మద్!) వారు నిన్ను శిక్ష కొరకు తొందర పెడుతున్నారు. కాని అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్కల ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది

Choose other languages: