Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #7 Translated in Telugu

وَمِنَ النَّاسِ مَنْ يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّبِعُ كُلَّ شَيْطَانٍ مَرِيدٍ
మరియు ప్రజలలో ఒకడుంటాడు, జ్ఞానం లేనిదే, అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ ను అనుసరించేవాడు
كُتِبَ عَلَيْهِ أَنَّهُ مَنْ تَوَلَّاهُ فَأَنَّهُ يُضِلُّهُ وَيَهْدِيهِ إِلَىٰ عَذَابِ السَّعِيرِ
అతడిని (షైతాన్ ను) గురించి వ్రాయబడిందేమిటంటే, వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టుడిగా చేస్తాడు మరియు వాడికి మండే నరకాగ్ని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు
يَا أَيُّهَا النَّاسُ إِنْ كُنْتُمْ فِي رَيْبٍ مِنَ الْبَعْثِ فَإِنَّا خَلَقْنَاكُمْ مِنْ تُرَابٍ ثُمَّ مِنْ نُطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِنْ مُضْغَةٍ مُخَلَّقَةٍ وَغَيْرِ مُخَلَّقَةٍ لِنُبَيِّنَ لَكُمْ ۚ وَنُقِرُّ فِي الْأَرْحَامِ مَا نَشَاءُ إِلَىٰ أَجَلٍ مُسَمًّى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ۖ وَمِنْكُمْ مَنْ يُتَوَفَّىٰ وَمِنْكُمْ مَنْ يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِنْ بَعْدِ عِلْمٍ شَيْئًا ۚ وَتَرَى الْأَرْضَ هَامِدَةً فَإِذَا أَنْزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ وَأَنْبَتَتْ مِنْ كُلِّ زَوْجٍ بَهِيجٍ
ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది
ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّهُ يُحْيِي الْمَوْتَىٰ وَأَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు
وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَا رَيْبَ فِيهَا وَأَنَّ اللَّهَ يَبْعَثُ مَنْ فِي الْقُبُورِ
మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది. అందులో ఎలాంటి సందేహం లేదు మరియు నిశ్చయంగా, అల్లాహ్ గోరీలలో నున్న వారిని మరల బ్రతికించి లేపుతాడు

Choose other languages: