Quran Apps in many lanuages:

Surah Al-Furqan Ayahs #4 Translated in Telugu

تَبَارَكَ الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا
సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు
الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُنْ لَهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا
భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు
وَاتَّخَذُوا مِنْ دُونِهِ آلِهَةً لَا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنْفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا
అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు
وَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا إِفْكٌ افْتَرَاهُ وَأَعَانَهُ عَلَيْهِ قَوْمٌ آخَرُونَ ۖ فَقَدْ جَاءُوا ظُلْمًا وَزُورًا
మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం ఒక బూటక కల్పన; దీనిని ఇతనే కల్పించాడు. మరియు ఇతర జాతివారు కొందరు, ఇతనికి ఈ పనిలో సహాయపడ్డారు. కాని వాస్తవానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పూనుకున్నారు

Choose other languages: