Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #62 Translated in Telugu

وَإِذْ قُلْنَا ادْخُلُوا هَٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ
మరియు మేము మీతో : ఈ నగరం (జేరుసలం)లో ప్రవేశించండి మరియు అక్కడున్న వస్తువులను మీ ఇష్టానుసారంగా కావలసినంత తినండి మరియు నగర ద్వారంలోకి వినమ్రులై తలవంచుతూ: `మమ్మల్ని క్షమించు (హిత్తతున్),` అంటూ ప్రవేశించండి; మేము మీ పాపాలను క్షమిస్తాము. మరియు మేము సజ్జనులను అత్యధికంగా కరుణిస్తాము." అని చెప్పిన మాటలను (జ్ఞప్తికి తెచ్చుకోండి)
فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنْزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
కాని దుర్మార్గులైన వారు, వారికి చెప్పిన మాటను మరొక మాటతో మార్చారు. కనుక, మేము దుర్మార్గం చేసిన వారిపై, వారి దౌష్ట్యాలకు ఫలితంగా, ఆకాశం నుండి ఆపదను దింపాము
وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِبْ بِعَصَاكَ الْحَجَرَ ۖ فَانْفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَشْرَبَهُمْ ۖ كُلُوا وَاشْرَبُوا مِنْ رِزْقِ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన ప్రజలకు నీటి కొరకు ప్రార్థించి నప్పుడు, మేము: నీవు ఆ బండను నీ కర్రతో కొట్టు!" అని ఆదేశించాము. అప్పుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగవారు తమ నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. (అప్పుడు వారితో అన్నాము): అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారాన్ని తినండి త్రాగండి కానీ, భూమిలో కల్లోలం రేపుతూ దౌర్జన్యపరులుగా తిరగకండి
وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَنْ نَصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنْبِتُ الْأَرْضُ مِنْ بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۖ قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي هُوَ خَيْرٌ ۚ اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُمْ مَا سَأَلْتُمْ ۗ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَاءُوا بِغَضَبٍ مِنَ اللَّهِ ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ۗ ذَٰلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ
మరియు అప్పుడు మీరు: ఓ మూసా!మేము ఒకే రకమైన ఆహారం తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకు కూరలు, దోసకాయలు (కూరగాయలు), వెల్లుల్లి (గోధుమలు), ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండించమని నీ ప్రభువును ప్రార్థించు." అని అన్నారు. దానికతను: ఏమీ? శ్రేష్ఠమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకుంటున్నారా? (అలాగయితే) మీరు ఏదైనా నగరానికి తిరిగిపొండి. నిశ్చయంగా, అక్కడ మీకు, మీరు కోరేదంతా దొరుకుతుంది!" అని అన్నాడు. మరియు వారు, తీవ్ర అవమానం మరియు దారిద్ర్యానికి గురయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు. అదంతా వాస్తవానికి వారు అల్లాహ్ సూచన (ఆయతు) లను తిరస్కరించిన దాని మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలితం. ఇదంతా వారు చేసిన ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం
إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصَارَىٰ وَالصَّابِئِينَ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు కానీ (ఎవరైనా సరే) ! అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి, వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంటుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

Choose other languages: