Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #21 Translated in Telugu

مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ ذَهَبَ اللَّهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لَا يُبْصِرُونَ
వారి ఉపమానం ఇలా ఉంది: ఒక అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింపజేసిన తర్వాత అల్లాహ్ వారి వెలుగును తీసుకుని వారిని అంధకారంలో విడిచి పెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేక పోతారు
صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ
(వారు) చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు (ఋజుమార్గానికి) మరలిరాలేరు
أَوْ كَصَيِّبٍ مِنَ السَّمَاءِ فِيهِ ظُلُمَاتٌ وَرَعْدٌ وَبَرْقٌ يَجْعَلُونَ أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ مِنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ۚ وَاللَّهُ مُحِيطٌ بِالْكَافِرِينَ
లేక (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మ చీకట్లలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరుముల భీకర ధ్వని విని, మృత్యుభయం చేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు
يَكَادُ الْبَرْقُ يَخْطَفُ أَبْصَارَهُمْ ۖ كُلَّمَا أَضَاءَ لَهُمْ مَشَوْا فِيهِ وَإِذَا أَظْلَمَ عَلَيْهِمْ قَامُوا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆ మెరుపు వారి దృష్టిని ఇంచు మించు ఎగురవేసుకు పోయినట్లుంటుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు, వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమ్ము కొనగానే వారు ఆగిపోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వినికిడినీ మరియు వారి చూపునూ తొలగించే వాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు

Choose other languages: