Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #122 Translated in Telugu

وَقَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ لَوْلَا يُكَلِّمُنَا اللَّهُ أَوْ تَأْتِينَا آيَةٌ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ مِثْلَ قَوْلِهِمْ ۘ تَشَابَهَتْ قُلُوبُهُمْ ۗ قَدْ بَيَّنَّا الْآيَاتِ لِقَوْمٍ يُوقِنُونَ
మరియు అజ్ఞానులు: అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన (ఆయత్) ఎందుకు రాదు? అని అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇదే విధంగా అడిగేవారు. వారందరి మనస్తత్వాలు (హృదయాలు) ఒకే విధమైనవి. వాస్తవానికి, దృఢనమ్మకం ఉన్న వారికి మేము మా సూచన (ఆయత్) లను సృష్టపరుస్తాము
إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۖ وَلَا تُسْأَلُ عَنْ أَصْحَابِ الْجَحِيمِ
నిశ్చయంగా, మేము నిన్ను (ఓ ముహమ్మద్) సత్యాన్ని ప్రసాదించి, శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసే వానిగా పంపాము. మరియు భగ-భగ మండే నరకాగ్నికి గురి అయ్యే వారిని గురించి నీవు ప్రశ్నించబడవు
وَلَنْ تَرْضَىٰ عَنْكَ الْيَهُودُ وَلَا النَّصَارَىٰ حَتَّىٰ تَتَّبِعَ مِلَّتَهُمْ ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۗ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُمْ بَعْدَ الَّذِي جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ مَا لَكَ مِنَ اللَّهِ مِنْ وَلِيٍّ وَلَا نَصِيرٍ
మరియు యూదులైనా, క్రైస్తవులైనా నీవు వారి మతమును అనుసరించే వరకూ, వారు నీతో సంపన్నులు కారు. నీవు: నిశ్చయంగా, అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం." అని చెప్పు. మరియు నీకు జ్ఞానం లభించిన తరువాత కూడా, నీవు వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (శిక్ష) నుండి నిన్ను రక్షించేవాడు గానీ, సహాయపడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు
الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَنْ يَكْفُرْ بِهِ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
మేము దివ్య గ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు), దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో పఠించ వలసిన విధంగా పఠిస్తే, అలాంటి వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరించే వారే నష్టపడువారు
يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ
ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నిశ్చయంగా, నేను మిమ్మల్ని (మీ కాలంలోని) సర్వ లోకాల వారి కంటే ఎక్కువగా ఆదరించాను

Choose other languages: