Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #14 Translated in Telugu

فِي قُلُوبِهِمْ مَرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ
వారి హృదయాలలో రోగముంది. కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది
وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ
మరియు: భువిలో కల్లోలం రేకెత్తించకండి." అని వారితో అన్నప్పుడు; వారు: మేము సంస్కర్తలము మాత్రమే!" అని అంటారు
أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَٰكِنْ لَا يَشْعُرُونَ
జాగ్రత్త! నిశ్చయంగా, (భువిలో) కల్లోలం రేకెత్తిస్తున్నవారు వీరే, కాని వారది గ్రహించటం లేదు
وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَٰكِنْ لَا يَعْلَمُونَ
మరియు: ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి." అని, వారితో అన్నప్పుడు, వారు: మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వసించాలా?" అని జవాబిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు
وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ
మరియు విశ్వాసులను కలిసి నపుడు, వారు: మేము విశ్వసించాము." అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్ట నాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము. కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము." అని అంటారు

Choose other languages: