Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #90 Translated in Telugu

وَلَا تَقْعُدُوا بِكُلِّ صِرَاطٍ تُوعِدُونَ وَتَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ بِهِ وَتَبْغُونَهَا عِوَجًا ۚ وَاذْكُرُوا إِذْ كُنْتُمْ قَلِيلًا فَكَثَّرَكُمْ ۖ وَانْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు కల్లోలం రేకెత్తించిన వారి గతి ఏమయిందో చూడండి
وَإِنْ كَانَ طَائِفَةٌ مِنْكُمْ آمَنُوا بِالَّذِي أُرْسِلْتُ بِهِ وَطَائِفَةٌ لَمْ يُؤْمِنُوا فَاصْبِرُوا حَتَّىٰ يَحْكُمَ اللَّهُ بَيْنَنَا ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ
మరియు నా ద్వారా పంపబడిన దానిని (సందేశాన్ని) మీలో ఒక వర్గం వారు విశ్వసించి, మరొక వర్గం వారు విశ్వసించకపోతే! అల్లాహ్ మన మధ్య తీర్పు చేసే వరకూ సహనం వహించండి. మరియు ఆయనే అత్యుత్తమమైన న్యాయాధిపతి
قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِنْ قَوْمِهِ لَنُخْرِجَنَّكَ يَا شُعَيْبُ وَالَّذِينَ آمَنُوا مَعَكَ مِنْ قَرْيَتِنَا أَوْ لَتَعُودُنَّ فِي مِلَّتِنَا ۚ قَالَ أَوَلَوْ كُنَّا كَارِهِينَ
దురహంకారులైన అతని జాతి నాయకులన్నారు: ఓ షుఐబ్! మేము నిన్నూ మరియు నీతో పాటు విశ్వసించిన వారినీ, మా నరగం నుండి తప్పక వెడలగొడ్తాము. లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి!" అతనన్నాడు: మేము దానిని అసహ్యించుకున్నప్పటికీ (మీ ధర్మంలోకి చేరాలా)
قَدِ افْتَرَيْنَا عَلَى اللَّهِ كَذِبًا إِنْ عُدْنَا فِي مِلَّتِكُمْ بَعْدَ إِذْ نَجَّانَا اللَّهُ مِنْهَا ۚ وَمَا يَكُونُ لَنَا أَنْ نَعُودَ فِيهَا إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ رَبُّنَا ۚ وَسِعَ رَبُّنَا كُلَّ شَيْءٍ عِلْمًا ۚ عَلَى اللَّهِ تَوَكَّلْنَا ۚ رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَأَنْتَ خَيْرُ الْفَاتِحِينَ
(ఇంకా ఇలా అన్నాడు): వాస్తవంగా అల్లాహ్ మాకు (మీ ధర్మం నుండి) విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే! మేము అల్లాహ్ పై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లాహ్ కోరితే తప్ప! మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. మేము అల్లాహ్ పైననే ఆధరపడి ఉన్నాము. `ఓ మా ప్రభూ! మా మధ్య మరియు మా జాతివారి మధ్య న్యాయంగా తీర్పు చేయి. మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు
وَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ لَئِنِ اتَّبَعْتُمْ شُعَيْبًا إِنَّكُمْ إِذًا لَخَاسِرُونَ
మరియు అతన జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు అన్నారు: ఒకవేళ మీరు షుఐబ్ ను అనుసరిస్తే! నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు

Choose other languages: