Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #172 Translated in Telugu

وَقَطَّعْنَاهُمْ فِي الْأَرْضِ أُمَمًا ۖ مِنْهُمُ الصَّالِحُونَ وَمِنْهُمْ دُونَ ذَٰلِكَ ۖ وَبَلَوْنَاهُمْ بِالْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మరియు మేము వారిని భువిలో వేర్వేరు తెగలుగా జేసి వ్యాపింప జేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరి కొందరు దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు (సన్మార్గానికి) మరలి వస్తారేమోనని, మేము వారిని మంచి-చెడు స్థితుల ద్వారా పరీక్షించాము
فَخَلَفَ مِنْ بَعْدِهِمْ خَلْفٌ وَرِثُوا الْكِتَابَ يَأْخُذُونَ عَرَضَ هَٰذَا الْأَدْنَىٰ وَيَقُولُونَ سَيُغْفَرُ لَنَا وَإِنْ يَأْتِهِمْ عَرَضٌ مِثْلُهُ يَأْخُذُوهُ ۚ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِمْ مِيثَاقُ الْكِتَابِ أَنْ لَا يَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ وَدَرَسُوا مَا فِيهِ ۗ وَالدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
ఆ పిదప వారి తరువాత దుష్టులైన వారు వారి స్థానంలో గ్రంథానికి వారసులై, తుచ్ఛమైన ప్రాపంచిక వస్తువుల లోభంలో పడుతూ: మేము క్షమింపబడతాము." అని పలుకుతున్నారు. అయినా ఇటువంటి సొత్తు తిరిగి వారికి లభిస్తే దానిని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అల్లాహ్ విషయంలో సత్యం తప్ప మరేమీ పలుకరాదు." అని గ్రంథంలో వారితో వాగ్దానం తీసుకో బడలేదా ఏమిటి? అందులో (గ్రంథంలో) ఉన్నదంతా వారు చదివారు కదా! మరియు దైభీతి గలవారి కొరకు పరలోక నివాసమే ఉత్తమమైనది, ఏమీ? మీరిది గ్రహించలేరా
وَالَّذِينَ يُمَسِّكُونَ بِالْكِتَابِ وَأَقَامُوا الصَّلَاةَ إِنَّا لَا نُضِيعُ أَجْرَ الْمُصْلِحِينَ
మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో, అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము
وَإِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَأَنَّهُ ظُلَّةٌ وَظَنُّوا أَنَّهُ وَاقِعٌ بِهِمْ خُذُوا مَا آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము (తూర్) పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే! వాస్తవానికి, వారు అది తమపై పడుతుందేమోనని భావించినప్పుడు మేము వారితో అన్నాము: మేము మీకు ఇచ్చిన దానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి మరియు అందులో ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి, దానితో మీరు దైవభీతి పరులు కావచ్చు
وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِي آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنْفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَنْ تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్ సంతతి వారి వీపున నుండి వారి సంతానాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: ఏమీ? నేను మీ ప్రభువును కానా?" అని అడుగగా! వారు: అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము." అని జవాబిచ్చారు. తీర్పుదినమున మీరు: నిశ్చయంగా, మేము దీనిని ఎరుగము." అని అనగూడదని

Choose other languages: