Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #139 Translated in Telugu

فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ إِلَىٰ أَجَلٍ هُمْ بَالِغُوهُ إِذَا هُمْ يَنْكُثُونَ
కానీ, ఒక నిర్ణీతకాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే - ఆ కాలానికి వారు చేరుకోవలసిన వారే కాబట్టి - వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు
فَانْتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ فِي الْيَمِّ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ
కావున మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారిని సముద్రంలో ముంచి వేశాము; ఎందుకంటే! వాస్తవానికి వారు మా సూచనలను అసత్యాలని తిరస్కరించారు మరియు వాటిని లక్ష్యపెట్టకుండా ఉన్నారు
وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الْأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَا ۖ وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنَىٰ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ بِمَا صَبَرُوا ۖ وَدَمَّرْنَا مَا كَانَ يَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهُ وَمَا كَانُوا يَعْرِشُونَ
మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడేవారిని మేము శుభాలతో నింపిన, ఆ దేశపు తూర్పు భాగాలకు మరియు పశ్చిమ భాగాలకు వారసులుగా చేశాము. ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయీల్ సంతతి వారికి చేసిన ఉత్తమమైన వాగ్దానం, వారు ఓర్పు వహించి నందుకు పూర్తయింది. మరియు ఫిర్ఔన్ మరియు అతని జాతి వారు ఉత్పత్తి చేసిన వాటిని మరియు ఎత్తిన (నిర్మించిన) కట్టడాలను నాశనం చేశాము
وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتَوْا عَلَىٰ قَوْمٍ يَعْكُفُونَ عَلَىٰ أَصْنَامٍ لَهُمْ ۚ قَالُوا يَا مُوسَى اجْعَلْ لَنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ ۚ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ
మరియు మేము ఇస్రాయీల్ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు (నడుస్తూ) తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతి వద్దకు చేరారు. వారన్నారు: ఓ మూసా! వీరి ఆరాధ్య దైవాల వలే మాకు కూడా ఒక ఆరాధ్య దైవాన్ని నియమించు." (దానికి మూసా) జవాబిచ్చాడు: నిశ్చయంగా, మీరు జ్ఞానహినులైన జాతికి చెందినవారు
إِنَّ هَٰؤُلَاءِ مُتَبَّرٌ مَا هُمْ فِيهِ وَبَاطِلٌ مَا كَانُوا يَعْمَلُونَ
నిశ్చయంగా వీరు ఆచరిస్తున్నందుకు (విగ్రహారాధన చేస్తున్నందుకు) నాశనం చేయబడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్థకమైనదే

Choose other languages: