Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #127 Translated in Telugu

قَالَ فِرْعَوْنُ آمَنْتُمْ بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَٰذَا لَمَكْرٌ مَكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
ఫిర్ఔన్ అన్నాడు: నేను అనుమతి ఇవ్వక ముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడల గొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు
لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُمْ مِنْ خِلَافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను
قَالُوا إِنَّا إِلَىٰ رَبِّنَا مُنْقَلِبُونَ
వారు ఇలా జవాబిచ్చారు: నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది
وَمَا تَنْقِمُ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِآيَاتِ رَبِّنَا لَمَّا جَاءَتْنَا ۚ رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ
మరియు మా ప్రభువు తరఫు నుండి మా వద్దకు వచ్చిన సూచనలను, మేము విశ్వసించామనే కదా! నీవు మాతో పగతీర్చుకోదలచావు." (ఇలా ప్రార్థించారు): ఓ మా ప్రభూ! మాకు సహనమొసంగు. మేము నీకు విధేయులముగా (ముస్లింలముగా) మృతినొందేటట్లు చేయి
وَقَالَ الْمَلَأُ مِنْ قَوْمِ فِرْعَوْنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوْمَهُ لِيُفْسِدُوا فِي الْأَرْضِ وَيَذَرَكَ وَآلِهَتَكَ ۚ قَالَ سَنُقَتِّلُ أَبْنَاءَهُمْ وَنَسْتَحْيِي نِسَاءَهُمْ وَإِنَّا فَوْقَهُمْ قَاهِرُونَ
మరియు ఫిర్ఔన్ జాతి నాయకులు అతనితో అన్నారు: ఏమీ? భూమిలో కల్లోలం రేకెత్తించటానికి మరియు నిన్నూ నీ దేవతలను విడిచి పోవటానికి, నీవు మూసాను మరియు అతని జాతి వారిని వదులుతున్నావా?" అతడు (ఫిర్ఔన్) జవాబిచ్చాడు: మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము. మరియు నిశ్చయంగా, మేము వారిపై ప్రాబల్యం కలిగి ఉన్నాము

Choose other languages: