Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #119 Translated in Telugu

قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَنْ تُلْقِيَ وَإِمَّا أَنْ نَكُونَ نَحْنُ الْمُلْقِينَ
వారన్నారు: ఓ మూసా! (ముందు) నీవు విసురుతావా? లేక మేము విసరాలా
قَالَ أَلْقُوا ۖ فَلَمَّا أَلْقَوْا سَحَرُوا أَعْيُنَ النَّاسِ وَاسْتَرْهَبُوهُمْ وَجَاءُوا بِسِحْرٍ عَظِيمٍ
(మూసా) అన్నాడు: (ముందు) మీరే విసరండి!" వారు (తమ కర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు
وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَلْقِ عَصَاكَ ۖ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
మేము మూసాకు: నీ చేతికర్రను విసురు." అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి (మాంత్రికుల) బూటక (మాయాజాలాన్ని) మ్రింగి వేసింది
فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ
ఈ విధంగా సత్యం స్థాపితమయ్యింది మరియు వారు (మాంత్రికులు) చేసిందంతా విఫలమయ్యింది
فَغُلِبُوا هُنَالِكَ وَانْقَلَبُوا صَاغِرِينَ
ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు

Choose other languages: