Quran Apps in many lanuages:

Surah Al-Anbiya Ayahs #83 Translated in Telugu

فَفَهَّمْنَاهَا سُلَيْمَانَ ۚ وَكُلًّا آتَيْنَا حُكْمًا وَعِلْمًا ۚ وَسَخَّرْنَا مَعَ دَاوُودَ الْجِبَالَ يُسَبِّحْنَ وَالطَّيْرَ ۚ وَكُنَّا فَاعِلِينَ
అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్ తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము. మరియు నిశ్చయంగా, మేమే (ప్రతిదీ) చేయగలవారము
وَعَلَّمْنَاهُ صَنْعَةَ لَبُوسٍ لَكُمْ لِتُحْصِنَكُمْ مِنْ بَأْسِكُمْ ۖ فَهَلْ أَنْتُمْ شَاكِرُونَ
మరియు మేము అతనికి, మీ యుద్ధాలలో, మీ రక్షణ కొరకు కవచాలు తయారు చేయడం నేర్పాము. అయితే! (ఇప్పుడైనా) మీరు కృతజ్ఞులవుతారా
وَلِسُلَيْمَانَ الرِّيحَ عَاصِفَةً تَجْرِي بِأَمْرِهِ إِلَى الْأَرْضِ الَّتِي بَارَكْنَا فِيهَا ۚ وَكُنَّا بِكُلِّ شَيْءٍ عَالِمِينَ
మరియు మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్ కు (వశపరిచాము). అది అతని ఆజ్ఞతో మేము శుభాలను ప్రసాదించిన (అనుగ్రహించిన) భూమి మీద వీచేది. మరియు నిశ్చయంగా, మాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు
وَمِنَ الشَّيَاطِينِ مَنْ يَغُوصُونَ لَهُ وَيَعْمَلُونَ عَمَلًا دُونَ ذَٰلِكَ ۖ وَكُنَّا لَهُمْ حَافِظِينَ
మరియు షైతానులలో కొందరు అతని (సులైమాన్) కొరకు (సముద్రంలో) మునిగే వారు మరియు ఇతర పనులు కూడా చేసేవారు. మరియు నిశ్చయంగా, మేమే వారిని కనిపెట్టుకొని ఉండేవారము
وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنْتَ أَرْحَمُ الرَّاحِمِينَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): నిశ్చయంగా, నన్ను బాధ (వ్యాధి) చుట్టుకున్నది. మరియు నీవే కరుణామయులలో కెల్లా గొప్ప కరుణామయుడవు

Choose other languages: