Quran Apps in many lanuages:

Surah Al-Anbiya Ayahs #27 Translated in Telugu

لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ
తాను చేసే దానిని గురించి ఆయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు
أَمِ اتَّخَذُوا مِنْ دُونِهِ آلِهَةً ۖ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ ۖ هَٰذَا ذِكْرُ مَنْ مَعِيَ وَذِكْرُ مَنْ قَبْلِي ۗ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ الْحَقَّ ۖ فَهُمْ مُعْرِضُونَ
ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను: మీ నిదర్శనాన్ని తీసుకురండి." ఇది (ఈ ఖుర్ఆన్) నాతో పాటు ఉన్నవారికి హితబోధ; మరియు నా పూర్వీకులకు కూడా (ఇలాంటి) హితబోధలు (వచ్చాయి). కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహించలేదు, కావున వారు విముఖులై పోతున్నారు
وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము
وَقَالُوا اتَّخَذَ الرَّحْمَٰنُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۚ بَلْ عِبَادٌ مُكْرَمُونَ
వారంటున్నారు: అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే
لَا يَسْبِقُونَهُ بِالْقَوْلِ وَهُمْ بِأَمْرِهِ يَعْمَلُونَ
వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు

Choose other languages: