Quran Apps in many lanuages:

Surah Al-Anbiya Ayahs #107 Translated in Telugu

لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ وَتَتَلَقَّاهُمُ الْمَلَائِكَةُ هَٰذَا يَوْمُكُمُ الَّذِي كُنْتُمْ تُوعَدُونَ
ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి: మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే!" అని అంటారు
يَوْمَ نَطْوِي السَّمَاءَ كَطَيِّ السِّجِلِّ لِلْكُتُبِ ۚ كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ
(జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము. మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము
وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِنْ بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ
వాస్తవానికి మేము జబూర్ లో- మా హితబోధ తరువాత - నిశ్చయంగా, ఈ భూమికి సద్వర్తునులైన నా దాసులు వారసులవుతారని వ్రాసి ఉన్నాము
إِنَّ فِي هَٰذَا لَبَلَاغًا لِقَوْمٍ عَابِدِينَ
నిశ్చయంగా ఇందులో భక్తిపరులైన ప్రజలకు సందేశం ఉంది
وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِلْعَالَمِينَ
మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము

Choose other languages: