Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #155 Translated in Telugu

قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ مِنْ إِمْلَاقٍ ۖ نَحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
ఇలా అను: రండి మీ ప్రభువు మీకు నిషేధించి వున్న వాటిని మీకు వినిపిస్తాను: `మీరు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. మేమే మీకూ మరియు వారికి కూడా జీవనోపాధిని ఇచ్చేవారము. మరియు బహిరంగంగా గానీ, లేదా దొంగచాటుగా గానీ అశ్లీలమైన (సిగ్గుమాలిన) పనులను సమీపించకండి. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని, న్యాయం కొరకు తప్ప చంపకండి. మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు
وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۖ وَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَإِذَا قُلْتُمْ فَاعْدِلُوا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۖ وَبِعَهْدِ اللَّهِ أَوْفُوا ۚ ذَٰلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని, బాగుపరచటానికి తప్ప ఇతర ఉద్దేశ్యంతో సమీపించకండి. కొలవటంలో మరియు తూచటంలో న్యాయాన్ని పాటించండి. ఏ ప్రాణిపై గడూ మేము దాని శక్తికి మించిన భారాన్ని మోపము. పలికితే న్యాయమే పలకండి. అది మీ దగ్గరి బంధువుకు (ప్రతికూలమైనది) అయినా సరే! అల్లాహ్ తో చేసిన ఒడంబడికను పూర్తి చేయండి. మీరు హితోపదేశం స్వీకరించాలని ఆయన మీకు ఈ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాడు
وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَنْ سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
మరియు నిశ్చయంగా, ఇదే ఋజుమార్గం, కావున మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పిస్తాయి. మీరు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన మిమ్మల్ని ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు
ثُمَّ آتَيْنَا مُوسَى الْكِتَابَ تَمَامًا عَلَى الَّذِي أَحْسَنَ وَتَفْصِيلًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لَعَلَّهُمْ بِلِقَاءِ رَبِّهِمْ يُؤْمِنُونَ
తరువాత మేము మూసాకు - సజ్జనులపై మా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, ప్రతి విషయాన్ని వివరించటానికి మరియు మార్గదర్శకత్వం మరియు కరుణను చూపటానికి మరియు వారు తమ ప్రభువును దర్శించవలసి ఉన్న దానిని విశ్వసించటానికి - గ్రంథాన్ని ప్రసాదించాము
وَهَٰذَا كِتَابٌ أَنْزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి, భయభక్తులు కలిగి ఉంటే, మీరు కరుణింపబడవచ్చు

Choose other languages: