Quran Apps in many lanuages:

Surah Al-Ahzab Ayahs #55 Translated in Telugu

تُرْجِي مَنْ تَشَاءُ مِنْهُنَّ وَتُؤْوِي إِلَيْكَ مَنْ تَشَاءُ ۖ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَيْكَ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَنْ تَقَرَّ أَعْيُنُهُنَّ وَلَا يَحْزَنَّ وَيَرْضَيْنَ بِمَا آتَيْتَهُنَّ كُلُّهُنَّ ۚ وَاللَّهُ يَعْلَمُ مَا فِي قُلُوبِكُمْ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَلِيمًا
నీవు వారిలో (నీ భార్యలలో) నుండి, నీవు కోరిన ఆమెను నీ నుండి కొంత కాలం వేరుగా ఉంచవచ్చు. మరియు నీవు కోరిన ఆమెను నీతోపాటు ఉంచవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకోగోరితే, నీపై ఎలాంటి దోషం లేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరనీ నీవు వారికి ఏమి ఇచ్చినా, వారు సంతోషపడతారని ఆశించవచ్చు! వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లాహ్ కు తెలుసు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు (సహన శీలుడు)
لَا يَحِلُّ لَكَ النِّسَاءُ مِنْ بَعْدُ وَلَا أَنْ تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ إِلَّا مَا مَلَكَتْ يَمِينُكَ ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ رَقِيبًا
వీరు గాక, ఇతర స్త్రీలు నీకు (వివాహమాడటానికి) ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు - వారి సౌందర్యం నీకు ఎంత నచ్చినా - నీ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలు తప్ప! వాస్తవానికి అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَدْخُلُوا بُيُوتَ النَّبِيِّ إِلَّا أَنْ يُؤْذَنَ لَكُمْ إِلَىٰ طَعَامٍ غَيْرَ نَاظِرِينَ إِنَاهُ وَلَٰكِنْ إِذَا دُعِيتُمْ فَادْخُلُوا فَإِذَا طَعِمْتُمْ فَانْتَشِرُوا وَلَا مُسْتَأْنِسِينَ لِحَدِيثٍ ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ يُؤْذِي النَّبِيَّ فَيَسْتَحْيِي مِنْكُمْ ۖ وَاللَّهُ لَا يَسْتَحْيِي مِنَ الْحَقِّ ۚ وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعًا فَاسْأَلُوهُنَّ مِنْ وَرَاءِ حِجَابٍ ۚ ذَٰلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَقُلُوبِهِنَّ ۚ وَمَا كَانَ لَكُمْ أَنْ تُؤْذُوا رَسُولَ اللَّهِ وَلَا أَنْ تَنْكِحُوا أَزْوَاجَهُ مِنْ بَعْدِهِ أَبَدًا ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ عِنْدَ اللَّهِ عَظِيمًا
ఓ విశ్వాసులారా! ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం (పిలువబడినపుడు) ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి, కాని మీరు పిలువబడి నప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపొండి మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా, దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది; కాని అతను మిమ్మల్ని (పొమ్మనటానికి) సంకోచిస్తాడు. మరియు అల్లాహ్ సత్యం చెప్పటానికి సంకోచించడు (సిగ్గు పడడు). మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగ వలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం
إِنْ تُبْدُوا شَيْئًا أَوْ تُخْفُوهُ فَإِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
ఒకవేళ మీరు ఏ విషయాన్నైనా వెలిబుచ్చినా లేదా దానిని దాచినా! నిశ్చయంగా, అల్లాహ్ కు మాత్రం ప్రతి విషయం గురించి బాగా తెలుసు
لَا جُنَاحَ عَلَيْهِنَّ فِي آبَائِهِنَّ وَلَا أَبْنَائِهِنَّ وَلَا إِخْوَانِهِنَّ وَلَا أَبْنَاءِ إِخْوَانِهِنَّ وَلَا أَبْنَاءِ أَخَوَاتِهِنَّ وَلَا نِسَائِهِنَّ وَلَا مَا مَلَكَتْ أَيْمَانُهُنَّ ۗ وَاتَّقِينَ اللَّهَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا
వారిపై (ప్రవక్త భార్యలపై) - తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరీమణుల కుమారుల, తమ స్త్రీల లేదా తమ బానిస (స్త్రీల) - యెదుట వస్తే ఎలాంటి దోషం లేదు. (ఓ స్త్రీలారా!) మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షి

Choose other languages: