Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Ayahs #6 Translated in Telugu

تَنْزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది
مَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُسَمًّى ۚ وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنْذِرُوا مُعْرِضُونَ
మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాము. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవు తున్నారు
قُلْ أَرَأَيْتُمْ مَا تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ ۖ ائْتُونِي بِكِتَابٍ مِنْ قَبْلِ هَٰذَا أَوْ أَثَارَةٍ مِنْ عِلْمٍ إِنْ كُنْتُمْ صَادِقِينَ
వారితో ఇలా అను: అల్లాహ్ ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి. వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్ఆన్ కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి
وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللَّهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ
మరియు అల్లాహ్ ను వదలి పునరుత్థాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారి కంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు (తమను ప్రార్థించే) వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు
وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మరియు మానవులను (పునరుత్థాన దినమున) సమావేశ పరచిబడినపుడు, (ఆరాధించబడిన) వారు! (తమను ఆరాధించిన) వారికి విరోధులై ఉంటారు. మరియు వారి ఆరాధనను తిరస్కరిస్తారు

Choose other languages: