Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #142 Translated in Telugu

هَٰذَا بَيَانٌ لِلنَّاسِ وَهُدًى وَمَوْعِظَةٌ لِلْمُتَّقِينَ
ఇది (ఈ ఖుర్ఆన్) ప్రజల కొరకు ఒక స్పష్టమైన వ్యాఖ్యానం మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం
وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنْتُمُ الْأَعْلَوْنَ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
కాబట్టి మీరు బలహీనత కనబరచకండి మరియు దుఃఖపడకండి మరియు మీరు విశ్వాసులే అయితే, మీరే తప్పక ప్రాబల్యం పొందుతారు
إِنْ يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِثْلُهُ ۚ وَتِلْكَ الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنْكُمْ شُهَدَاءَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
ఒకవేళ ఇప్పుడు మీరు గాయపడితే, వాస్తవానికి ఆ జాతివారు (మీ విరోధులు) కూడా ఇదే విధంగా గాయపడ్డారు. మరియు మేము ఇలాంటి దినాలను ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. మరియు అల్లాహ్, మీలో నిజమైన విశ్వాసులెవ్వరో చూడటానికి మరియు (సత్యస్థాపనకు) తమ ప్రాణాలను త్యాగం చేయగల వారిని ఎన్నుకోవటానికి ఇలా చేస్తూ ఉంటాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు
وَلِيُمَحِّصَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ
మరియు అల్లాహ్ విశ్వాసులను పరిశుద్ధులుగా చేయటానికీ మరియు సత్యతిరస్కారులను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు)
أَمْ حَسِبْتُمْ أَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنْكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ
ఏమీ? మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు (ధర్మయోధులు) ఎవరో, అల్లాహ్ చూడక ముందే మరియు సహనం చూపేవారు ఎవరో చూడకముందే, మీరు స్వర్గంలో ప్రవేశించ గలరని భావిస్తున్నారా

Choose other languages: