Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #72 Translated in Telugu

وَلَمَّا دَخَلُوا مِنْ حَيْثُ أَمَرَهُمْ أَبُوهُمْ مَا كَانَ يُغْنِي عَنْهُمْ مِنَ اللَّهِ مِنْ شَيْءٍ إِلَّا حَاجَةً فِي نَفْسِ يَعْقُوبَ قَضَاهَا ۚ وَإِنَّهُ لَذُو عِلْمٍ لِمَا عَلَّمْنَاهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
మరియు వారు తమ తండ్రి ఆజ్ఞ ప్రకారం (ఆ నగరంలో వేర్వేరు ద్వారాల గుండా) ప్రవేశించారు. అది కేవలం యఅఖూబ్ మనస్సులోని కోరికను పూర్తి చేయటానికి మాత్రమే, కాని అల్లాహ్ సంకల్పం నుండి తప్పించుకోవటానికి, వారికి ఏ మాత్రమూ పనికి రాలేదు. మేము అతనికి నేర్పిన జ్ఞానం ప్రకారం అతను జ్ఞానవంతుడే కాని చాలా మందికి తెలియదు
وَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَخَاهُ ۖ قَالَ إِنِّي أَنَا أَخُوكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَعْمَلُونَ
మరియు వారు యూసుఫ్ వద్ద ప్రవేశించగా అతను తన సోదరుణ్ణి (బెన్యామీన్ ను) తన దగ్గరికి తీసుకున్నాడు. అతనితో అన్నాడు: వాస్తవానికి! నేనే నీ (తప్పిపోయిన) సోదరుడను, కావున వారు ఇంత వరకు చేస్తూ వచ్చిన పనులకు నీవు దుఃఖపడకు
فَلَمَّا جَهَّزَهُمْ بِجَهَازِهِمْ جَعَلَ السِّقَايَةَ فِي رَحْلِ أَخِيهِ ثُمَّ أَذَّنَ مُؤَذِّنٌ أَيَّتُهَا الْعِيرُ إِنَّكُمْ لَسَارِقُونَ
వారికి వారి సామగ్రి సిద్ధపరచిన తరువాత తన సోదరుని జీను సంచిలో ఒక నీరు త్రాగే పాత్రను పెట్టాడు. ఆ పిదప ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటించాడు: ఓ బిడారు వారలారా! మీరు నిశ్చయంగా దొంగలు
قَالُوا وَأَقْبَلُوا عَلَيْهِمْ مَاذَا تَفْقِدُونَ
వారు (యూసుఫ్ సోదరులు) వారి వైపు తిరిగి ఇలా అన్నారు: మీ వస్తువు ఏదైనా పోయిందా
قَالُوا نَفْقِدُ صُوَاعَ الْمَلِكِ وَلِمَنْ جَاءَ بِهِ حِمْلُ بَعِيرٍ وَأَنَا بِهِ زَعِيمٌ
(కార్యకర్తలు) అన్నారు: రాజు గారి పాత్రపోయింది! మరియు ఎవడు దానిని తీసుకొని వస్తాడో అతనికి ఒక ఒంటె బరువు ధాన్యం (బహుమానంగా) ఇవ్వబడుతుంది మరియు నేను దానికి బాధ్యుణ్ణి

Choose other languages: