Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #32 Translated in Telugu

فَلَمَّا رَأَىٰ قَمِيصَهُ قُدَّ مِنْ دُبُرٍ قَالَ إِنَّهُ مِنْ كَيْدِكُنَّ ۖ إِنَّ كَيْدَكُنَّ عَظِيمٌ
అతని అంగి వెనుక నుండి చినిగి ఉండటాన్ని చూసి (ఆమె భర్త) ఇలా అన్నాడు: నిశ్చయంగా, ఇది మీ స్త్రీల పన్నాగం. నిశ్చయంగా మీ పన్నాగం ఎంతో భయంకరమైనది
يُوسُفُ أَعْرِضْ عَنْ هَٰذَا ۚ وَاسْتَغْفِرِي لِذَنْبِكِ ۖ إِنَّكِ كُنْتِ مِنَ الْخَاطِئِينَ
ఓ యూసుఫ్! ఈ విషయాన్ని పోనివ్వు!" (తన భార్యతో అన్నాడు): నీవు నీ పాపానికి క్షమాపణ కోరుకో, నిశ్చయంగా నీవే తప్పు చేసిన దానవు
وَقَالَ نِسْوَةٌ فِي الْمَدِينَةِ امْرَأَتُ الْعَزِيزِ تُرَاوِدُ فَتَاهَا عَنْ نَفْسِهِ ۖ قَدْ شَغَفَهَا حُبًّا ۖ إِنَّا لَنَرَاهَا فِي ضَلَالٍ مُبِينٍ
మరియు నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు. అజీజ్ భార్య తన యువ బానిసను మోహింపగోరింది. నిశ్చయంగా ఆమె గాఢమైన ప్రేమలో పడి ఉంది. నిశ్చయంగా, ఆమె స్పష్టమైన పొరపాటులో ఉన్నట్లు మేము చూస్తున్నాము
فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ أَرْسَلَتْ إِلَيْهِنَّ وَأَعْتَدَتْ لَهُنَّ مُتَّكَأً وَآتَتْ كُلَّ وَاحِدَةٍ مِنْهُنَّ سِكِّينًا وَقَالَتِ اخْرُجْ عَلَيْهِنَّ ۖ فَلَمَّا رَأَيْنَهُ أَكْبَرْنَهُ وَقَطَّعْنَ أَيْدِيَهُنَّ وَقُلْنَ حَاشَ لِلَّهِ مَا هَٰذَا بَشَرًا إِنْ هَٰذَا إِلَّا مَلَكٌ كَرِيمٌ
ఆమె వారి నిందారోపణలు విని, వారికి ఆహ్వానం పంపింది. వారికి ఒక మంచి విందు ఏర్పాటు చేసి, ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క కత్తి ఇచ్చి, (యూసుఫ్ తో): వారి ముందుకు రా!" అని అన్నది. ఆ స్త్రీలు అతనిని చూడగానే నివ్వెరపోయారు మరియు (ఆశ్చర్యంతో చేతులలో ఉన్న కత్తులతో) తమ చేతులను కోసుకున్నారు. (అప్రయత్నంగా) అన్నారు: అల్లాహ్ మహిమ! (హాషలిల్లాహ్) ఇతను మానవుడు మాత్రం కాడు! ఇతను గొప్ప దేవదూతయే కాగలడు
قَالَتْ فَذَٰلِكُنَّ الَّذِي لُمْتُنَّنِي فِيهِ ۖ وَلَقَدْ رَاوَدْتُهُ عَنْ نَفْسِهِ فَاسْتَعْصَمَ ۖ وَلَئِنْ لَمْ يَفْعَلْ مَا آمُرُهُ لَيُسْجَنَنَّ وَلَيَكُونًا مِنَ الصَّاغِرِينَ
ఆమె అన్నది: ఇతనే ఆ మనిషి! ఇతనిని గురించే మీరు నాపై నిందలు మోపింది. వాస్తవానికి నేనే ఇతనిని మోహింప జేయటానికి ప్రయత్నించాను, కాని ఇతను తప్పించుకున్నాడు. కాని ఇతను ఇక నేను చెప్పింది చేయకుంటే తప్పక చెరసాల పాలు కాగలడు, లేదా తీవ్ర అవమానానికి గురి కాగలడు

Choose other languages: