Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #93 Translated in Telugu

قَالَ قَدْ أُجِيبَتْ دَعْوَتُكُمَا فَاسْتَقِيمَا وَلَا تَتَّبِعَانِّ سَبِيلَ الَّذِينَ لَا يَعْلَمُونَ
(అల్లాహ్) సెలవిచ్చాడు: మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడింది. మీరిద్దరూ (ఋజుమార్గంపై) స్థిరంగా ఉండండి. మీరిద్దరూ తెలివి లేని వారి మార్గాన్ని అనుసరించకండి
وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ وَجُنُودُهُ بَغْيًا وَعَدْوًا ۖ حَتَّىٰ إِذَا أَدْرَكَهُ الْغَرَقُ قَالَ آمَنْتُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا الَّذِي آمَنَتْ بِهِ بَنُو إِسْرَائِيلَ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ
మరియు మేము ఇస్రాయీల్ సంతతి వారిని సముద్రం దాటించాము. ఆ పిదప ఫిర్ఔన్ మరియు అతని సైనికులు దౌర్జన్యంతో మరియు శతృత్వంతో వారిని వెంబడించారు. చివరకు (ఫిర్ఔన్) మునిగిపోతూ అన్నాడు: నిశ్చయంగా, ఇస్రాయీల్ సంతతివారు విశ్వసించిన దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నేను విశ్వసించాను. నేను విధేయులలో (ముస్లింలలో) చేరాను
آلْآنَ وَقَدْ عَصَيْتَ قَبْلُ وَكُنْتَ مِنَ الْمُفْسِدِينَ
(అతనికి ఇలా జవాబివ్వబడింది): ఇప్పుడా, (నీవు విశ్వసించేది? మరియు వాస్తవానికి నీవు, ఇంత వరకు ఆజ్ఞోల్లంఘన చేస్తూ ఉన్నావు మరియు దౌర్జన్యపరులలో చేరి ఉన్నావు కదా)
فَالْيَوْمَ نُنَجِّيكَ بِبَدَنِكَ لِتَكُونَ لِمَنْ خَلْفَكَ آيَةً ۚ وَإِنَّ كَثِيرًا مِنَ النَّاسِ عَنْ آيَاتِنَا لَغَافِلُونَ
ఇక నీ తరువాత వచ్చేవారికి ఒక సూచనగా ఉండటానికి ఈనాడు నీ శవాన్ని కాపాడతాము." మరియు నిశ్చయంగా, చాలా మంది ప్రజలు మా సూచనల పట్ల నిర్లక్ష్యులై ఉన్నారు
وَلَقَدْ بَوَّأْنَا بَنِي إِسْرَائِيلَ مُبَوَّأَ صِدْقٍ وَرَزَقْنَاهُمْ مِنَ الطَّيِّبَاتِ فَمَا اخْتَلَفُوا حَتَّىٰ جَاءَهُمُ الْعِلْمُ ۚ إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
మరియు వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఉండటానికి మంచి స్థానాన్ని ఇచ్చి, వారికి ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాము. మరియు వారి వద్దకు దివ్యజ్ఞానం వచ్చినంత వరకు వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదు. నిశ్చయంగా, నీ ప్రభువు పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు

Choose other languages: