Quran Apps in many lanuages:

Surah Ta-Ha Ayahs #108 Translated in Telugu

نَحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ إِذْ يَقُولُ أَمْثَلُهُمْ طَرِيقَةً إِنْ لَبِثْتُمْ إِلَّا يَوْمًا
వారు ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో మంచి తెలివి గలవారు: మీరు కేవలం ఒక్క దినం మాత్రమే ఉన్నారు!" అని అంటారు
وَيَسْأَلُونَكَ عَنِ الْجِبَالِ فَقُلْ يَنْسِفُهَا رَبِّي نَسْفًا
మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు
فَيَذَرُهَا قَاعًا صَفْصَفًا
ఆ తరువాత దానిని (భూమిని) చదునైన మైదానంగా చేసి వేస్తాడు
لَا تَرَىٰ فِيهَا عِوَجًا وَلَا أَمْتًا
నీవు దానిలో ఎలాంటి పల్లం గానీ, మిట్టగానీ చూడలేవు
يَوْمَئِذٍ يَتَّبِعُونَ الدَّاعِيَ لَا عِوَجَ لَهُ ۖ وَخَشَعَتِ الْأَصْوَاتُ لِلرَّحْمَٰنِ فَلَا تَسْمَعُ إِلَّا هَمْسًا
ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు. అనంత కరణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు

Choose other languages: