Quran Apps in many lanuages:

Surah Ta-Ha Ayahs #103 Translated in Telugu

كَذَٰلِكَ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنْبَاءِ مَا قَدْ سَبَقَ ۚ وَقَدْ آتَيْنَاكَ مِنْ لَدُنَّا ذِكْرًا
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవంగా మేము, మా తరఫు నుండి నీకు హితోపదేశాన్ని (ఈ ఖుర్ఆన్ ను) ప్రసాదించాము
مَنْ أَعْرَضَ عَنْهُ فَإِنَّهُ يَحْمِلُ يَوْمَ الْقِيَامَةِ وِزْرًا
దీని నుండి ముఖం త్రిప్పుకునే వాడు పునరుత్థాన దినమున (గొప్ప పాప) భారాన్ని భరిస్తాడు
خَالِدِينَ فِيهِ ۖ وَسَاءَ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ حِمْلًا
అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. పునరుత్థాన దినమున వారికా భారం ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది
يَوْمَ يُنْفَخُ فِي الصُّورِ ۚ وَنَحْشُرُ الْمُجْرِمِينَ يَوْمَئِذٍ زُرْقًا
ఆ దినమున బాకా (సూర్) ఊదబడుతుంది. మరియు మేము అపరాధులను ఒకచోట జమ చేస్తాము. ఆ రోజు వారి కళ్ళు (భయంతో) నీలమై పోతాయి
يَتَخَافَتُونَ بَيْنَهُمْ إِنْ لَبِثْتُمْ إِلَّا عَشْرًا
వారు ఒకరితో నొకరు ఇలా గుసగుసలాడుకుంటారు: మీరు (భూమిలో) పది (రోజుల) కంటే ఎక్కువ ఉండలేదు

Choose other languages: