Quran Apps in many lanuages:

Surah Maryam Ayahs #46 Translated in Telugu

إِذْ قَالَ لِأَبِيهِ يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَلَا يُغْنِي عَنْكَ شَيْئًا
అతను తన తండ్రితో ఇలా అన్నప్పుడు: ఓ నాన్నా! వినలేని మరియు చూడలేని మరియు నీకు ఏ విధంగానూ సహాయపడలేని వాటిని, నీవెందుకు ఆరాధిస్తున్నావు
يَا أَبَتِ إِنِّي قَدْ جَاءَنِي مِنَ الْعِلْمِ مَا لَمْ يَأْتِكَ فَاتَّبِعْنِي أَهْدِكَ صِرَاطًا سَوِيًّا
ఓ నాన్నా! వాస్తవానికి, నా వద్దకు వచ్చిన జ్ఞానం నీ వద్దకు రాలేదు, కావున నీవు నన్ను అనుసరిస్తే, నేను నీకు సరైన మార్గం చూపుతాను
يَا أَبَتِ لَا تَعْبُدِ الشَّيْطَانَ ۖ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلرَّحْمَٰنِ عَصِيًّا
ఓ నాన్నా! నీవు షైతాన్ ను ఆరాధించకు, నిశ్చయంగా షైతాన్ అనంత కరుణామయుణ్ణి ఉల్లంఘించాడు
يَا أَبَتِ إِنِّي أَخَافُ أَنْ يَمَسَّكَ عَذَابٌ مِنَ الرَّحْمَٰنِ فَتَكُونَ لِلشَّيْطَانِ وَلِيًّا
ఓ నాన్నా! నిశ్చయంగా, నీవు అనంత కరుణామయుని శిక్షకు గురి అయ్యి, షైతాను యొక్క స్నేహితుడవు / సహచరుడవు (వలి) అయి పోతావేమోనని నేను భయపడుతున్నాను
قَالَ أَرَاغِبٌ أَنْتَ عَنْ آلِهَتِي يَا إِبْرَاهِيمُ ۖ لَئِنْ لَمْ تَنْتَهِ لَأَرْجُمَنَّكَ ۖ وَاهْجُرْنِي مَلِيًّا
(అతని తండ్రి) అన్నాడు: ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవు నా దేవుళ్ళకు విముఖత చూపుతున్నావా? ఒకవేళ నీవిది మానుకోక పోతే నేను నిన్ను రాళ్ళు రువ్వి చంపిస్తాను. కావున నీవు నా నుండి చాలా దూరమై పో

Choose other languages: