Quran Apps in many lanuages:

Surah Maryam Ayahs #23 Translated in Telugu

قَالَ إِنَّمَا أَنَا رَسُولُ رَبِّكِ لِأَهَبَ لَكِ غُلَامًا زَكِيًّا
(దేవదూత ఇలా) జవాబిచ్చాడు: నిశ్చయంగా, నేను నీ ప్రభువు యొక్క సందేశహరుడను! నీకు ఒక సుశీలుడైన (నీతిమంతుడైన) కుమారుని (సందేశాన్ని) ఇవ్వటానికి పంపబడ్డాను
قَالَتْ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ وَلَمْ أَكُ بَغِيًّا
ఆమె ఇలా ప్రశ్నించింది: నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ మానవుడునూ ముట్టుకోలేదే! మరియు నేను చెడు నడవడిక గల దానిని కూడా కాను
قَالَ كَذَٰلِكِ قَالَ رَبُّكِ هُوَ عَلَيَّ هَيِّنٌ ۖ وَلِنَجْعَلَهُ آيَةً لِلنَّاسِ وَرَحْمَةً مِنَّا ۚ وَكَانَ أَمْرًا مَقْضِيًّا
అతనన్నాడు: అలాగే అవుతుంది! నీ ప్రభువు అంటున్నాడు: `అది నాకు సులభం! మేము అతనిని, మా నుండి ప్రజలకు ఒక సూచనగా మరియు కారుణ్యంగా పంపుతున్నాము.` మరియు (నీ ప్రభువు) ఆజ్ఞ నెరవేరి తీరుతుంది
فَحَمَلَتْهُ فَانْتَبَذَتْ بِهِ مَكَانًا قَصِيًّا
తరువాత మర్యమ్ ఆ బాలుణ్ణి గర్భంలో భరించి, అతనితో ఒక దూరమైన స్థలానికి వెళ్ళిపోయింది
فَأَجَاءَهَا الْمَخَاضُ إِلَىٰ جِذْعِ النَّخْلَةِ قَالَتْ يَا لَيْتَنِي مِتُّ قَبْلَ هَٰذَا وَكُنْتُ نَسْيًا مَنْسِيًّا
ఆ తరువాత ప్రసవ వేదనతో ఆమె ఒక ఖర్జూరపు చెట్టు మొదలు దగ్గరికి చేరుకొని ఇలా వాపోయింది: అయ్యో! నా దౌర్భాగ్యం, దీనికి ముందే నేను చనిపోయి వుంటే! మరియు నామరూపాలు లేకుండా నశించి పోతే ఎంత బాగుండేది

Choose other languages: