Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #14 Translated in Telugu

وَجَعَلَ فِيهَا رَوَاسِيَ مِنْ فَوْقِهَا وَبَارَكَ فِيهَا وَقَدَّرَ فِيهَا أَقْوَاتَهَا فِي أَرْبَعَةِ أَيَّامٍ سَوَاءً لِلسَّائِلِينَ
మరియు ఆయన దానిలో (భూమిలో) దాని పైనుండి స్థిరమైన పర్వతాలను నెలకొలిపాడు మరియు అందులో శుభాలను అనుగ్రహించాడు మరియు అర్థించేవారి కొరకు, వారి అవసరాలకు సరిపోయేటట్లు జీవనోపాధిని సమకూర్చాడు, ఇదంతా నాలుగు రోజులలో పూర్తి చేశాడు
ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ وَهِيَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْأَرْضِ ائْتِيَا طَوْعًا أَوْ كَرْهًا قَالَتَا أَتَيْنَا طَائِعِينَ
అప్పుడే ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి, దానిని మరియు భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: మీరిద్దరు (ఉనికిలోకి) రండి మీకు ఇష్టమున్నా, ఇష్టం లేక పోయినా!" అవి రెండూ: మేమిద్దరమూ విధేయులమై (ఉనికిలోకి) వస్తాము." అని అన్నాయి
فَقَضَاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ فِي يَوْمَيْنِ وَأَوْحَىٰ فِي كُلِّ سَمَاءٍ أَمْرَهَا ۚ وَزَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَحِفْظًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
కావున ఆయన వాటిని రెండు రోజులలో ఏడు ఆకాశాలుగా నిర్మించాడు, మరియు ప్రతి ఆకాశానికి దాని వ్యవహారాన్ని దివ్యజ్ఞానం (వహీ) ద్వారా నిర్దేశించాడు. మరియు మేము ఈ ప్రపంచపు ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో) అలంకరించాము మరియు దానిని సురక్షితం చేశాము. ఇదే సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియామకం
فَإِنْ أَعْرَضُوا فَقُلْ أَنْذَرْتُكُمْ صَاعِقَةً مِثْلَ صَاعِقَةِ عَادٍ وَثَمُودَ
ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే వారితో ఇలా అను: ఆద్ మరియు సమూద్ జాతుల వారిపై వచ్చి పడినట్టి గొప్ప పిడుగులాంటి శిక్ష గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను
إِذْ جَاءَتْهُمُ الرُّسُلُ مِنْ بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۖ قَالُوا لَوْ شَاءَ رَبُّنَا لَأَنْزَلَ مَلَائِكَةً فَإِنَّا بِمَا أُرْسِلْتُمْ بِهِ كَافِرُونَ
ఇక దైవప్రవక్తలు వారి వద్దకు వారి ముందు నుండి మరియు వారి వెనుక నుండి వచ్చి: మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి!" అని అన్నప్పుడు, వారు ఇలా అన్నారు: మా ప్రభువే గనక కోరితే దేవదూతలను పంపి ఉండేవాడు. కావున మేము మీ ద్వారా పంపబడిన దానిని నిశ్చయంగా, తిరస్కరిస్తున్నాము

Choose other languages: