Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #26 Translated in Telugu

وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ ۚ إِنَّ اللَّهَ يُسْمِعُ مَنْ يَشَاءُ ۖ وَمَا أَنْتَ بِمُسْمِعٍ مَنْ فِي الْقُبُورِ
మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వానికి (హితబోధ) వినేటట్లు చేస్తాడు. కాని నీవు గోరీలలో ఉన్న వారికి వినిపించ జాలవు
إِنْ أَنْتَ إِلَّا نَذِيرٌ
నీవు (ఓ ముహమ్మద్!) కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే
إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۚ وَإِنْ مِنْ أُمَّةٍ إِلَّا خَلَا فِيهَا نَذِيرٌ
నిశ్చయంగా, మేము, నిన్ను సత్యం ప్రసాదించి, శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు హెచ్చరిక చేసేవాడు వారి మధ్య లేకుండా, ఏ సమాజం కూడా గడచిపోలేదు
وَإِنْ يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ وَبِالزُّبُرِ وَبِالْكِتَابِ الْمُنِيرِ
మరియు ఒకవేళ వీరు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తున్నారంటే (ఆశ్చర్యమేమీ కాదు)! ఎందుకంటే, వీరిక పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. వారి సందేశహరులు, వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను, శాసనాలను (జబుర్ లను) మరియు వెలుగునిచ్చే గ్రంథాన్ని తీసుకొని వచ్చారు
ثُمَّ أَخَذْتُ الَّذِينَ كَفَرُوا ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
ఆ తరువాత సత్యతిరస్కారులను నేను (శిక్షకు) గురి చేశాను. (చూశారా) నా శిక్ష ఎంత కఠినమైనదో

Choose other languages: